: చంద్రబాబు కుప్పం పర్యటన నేడే!... సొంత ఇలాకాలో సీఎం సుడిగాలి పర్యటన!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళుతున్నారు. మరికాసేపట్లో విజయవాడ నుంచి బయలుదేరే ఆయన నేరుగా కుప్పం చేరుకుంటారు. కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేయనున్న చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పంలో పోలీసులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.