: నిండుకుండలా శ్రీశైలం జలాశయం!... రిజర్వాయర్ లో 100 టీఎంసీల నీరు!


కృష్ణా నదిపై ఏపీిలోని కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో నిర్మించిన శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా ఆ రాష్ట్రాల్లోని జలాశయాలన్నీ నిండిపోయాయి. దీంతో సదరు రిజర్వాయర్ల నుంచి నీరు కిందకు విడుదలైపోయింది. ఈ నీరు క్రమంగా శ్రీశైలం రిజర్వాయర్ కు చేరుతోంది. ఇప్పటికే శ్రీశైలంలో నీటి మట్టం 857 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 100 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వరద ఉద్ధృతి మరింతగా కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైలానికి ఇన్ ఫ్లో కొనసాగుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News