: ఇంటి పేర్లను నిషేధించి కులతత్వానికి చరమగీతం పలకాలి: దళిత సిద్ధాంతకర్త నరేంద్ర జాదవ్


ఇంటి పేర్ల (సర్ నేమ్)ను నిషేధించడం ద్వారా కులతత్వానికి చరమగీతం పాడవచ్చని రాజ్యసభ ఎంపీ, దళిత సిద్ధాంతకర్త నరేంద్రజాదవ్ అన్నారు. దళితులపై ఇటీవల పెరిగిపోతున్న దాడులపై మాట్లాడిన ఆయన కులతత్వాన్ని రూపుమాపేందుకు ఇంటి పేర్లను నిషేధించడమే సరైన మార్గమన్నారు. ఇందుకు సంబంధించిన చట్టం రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రైవేటు బిల్లును రాజ్యసభ ముందుకు తెస్తానని ఆయన పేర్కొన్నారు. ‘‘నల్లజాతి, శ్వేతజాతీయుల్లా భౌతికంగా కులాల్ని వేరు చేసే అవకాశం లేకపోవడంతో ఇంటి పేరు ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇది కులతత్వానికి నాంది పలికింది. కాబట్టి విధిగా అందరూ ఫ్యామిలీ పేర్లను పెట్టుకోవడం మానుకోవాలి’’ అని జాదవ్ పిలుపునిచ్చారు. యూపీఏ హయాంలో ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా పనిచేసిన జాదవ్‌ను ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభకు నామినేట్ చేశారు. సోనియాగాంధీ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్‌లోనూ జాదవ్ పనిచేశారు.

  • Loading...

More Telugu News