: కాసేపట్లో తెలంగాణకు ప్రధాని.. హైద‌రాబాద్‌లో బీజేపీ శ్రేణుల సంద‌డే సంద‌డి


ప్ర‌ధాని హోదాలో తొలిసారి నరేంద్రమోదీ తెలంగాణ‌కు వ‌స్తున్నారు. మ‌రికాసేప‌ట్లో ఆయ‌న‌ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లో భార‌తీయ పార్టీ శ్రేణుల‌ సంద‌డి క‌నిపిస్తోంది. బేగంపేట‌, ఎల్బీస్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో బీజేపీ కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో చేరుకున్నారు. మోదీ రాక వారిలో నూత‌నోత్సాహాన్ని నింపుతోంది. ఇప్ప‌టికే బేగంపేట విమానాశ్ర‌యానికి కేంద్ర‌మంత్రులు వెంక‌య్య నాయుడు, దత్తాత్రేయ చేరుకున్నారు. వారికి బీజేపీ రాష్ట్ర నేత‌లు ల‌క్ష్మ‌ణ్, కిష‌న్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ స్వాగతం ప‌లికారు. మోదీకి స్వాగతం ప‌లికేందుకు బేగంపేట విమానాశ్ర‌యానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ, హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి, మంత్రులు ప‌ద్మారావు, త‌ల‌సాని బేగంపేట‌కు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News