: గుజరాత్ పీఠమెక్కిన విజయ్ రూపానీ


గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ యువనేత విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారం చేశారు. రూపానీతో రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణం చేయించారు. ఇదే సమయంలో సీఎం పదవికి పోటీపడ్డ నితిన్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. కాగా, సీఎంగా పనిచేస్తున్న ఆనందీ బెన్ పటేల్ రాజీనామా అనంతరం తదుపరి సీఎంగా విజయ్ ని ఎంపిక చేసినట్టు బీజేపీ అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. మోదీ అడుగుజాడల్లో నడిచి, మరింత మెరుగైన పాలన అందిస్తానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News