: మోదీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నం... ఎక్కడికక్కడ అరెస్టులతో ఉద్రిక్తత


నేడు తెలంగాణలో తొలిసారిగా పర్యటించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కదలడంతో, వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మరికొందరిని ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేసి, ఇల్లు కదలకుండా చూస్తున్నారు. ప్రధాని సభకు బస్సుల్లో ప్రజలను తరలిస్తుండగా, ప్రతి వాహనాన్నీ గజ్వేల్ కు ముందే ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు, అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. కాంగ్రెస్ తో పాటు వామపక్షాల నేతలు, కార్యకర్తలు సభా వేదిక వద్దకు ప్రజలు, తెరాస కార్యకర్తల రూపంలో చేరుకోవచ్చని భావిస్తూ, తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రతి కిలోమీటరుకూ ఓ చెక్ పోస్టును ఏర్పాటు చేసిన పోలీసులు, ఇప్పటివరకూ 500 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News