: నేడు ఎన్టీఆర్ మనవడి పెళ్లి... వేదిక వద్ద చంద్రబాబు సందడి!


దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మనవడు, రామకృష్ణ కుమారుడి వివాహం నేడు ఉదయం 10 గంటలకు చెన్నై పారిశ్రామికవేత్త కుమార్తెతో కోయంబత్తూరులో వైభవంగా జరగనుండగా, ఏపీ సీఎం చంద్రబాబు ఈ వివాహానికి హాజరయ్యారు. అత్యంత సన్నిహితులు, దగ్గరి బంధువుల సమక్షంలో వివాహం జరగనుండటంతో, దాదాపు 50 మందికి పైగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఇప్పటికే వేదికకు చేరుకోగా, బాలకృష్ణ, లోకేష్ తదితరులు మరికాసేపట్లో రానున్నారు. కోవై విమానాశ్రయంలో దిగిన చంద్రబాబుకు చెన్నై తెలుగుదేశం పార్టీ విభాగం ఘన స్వాగతం పలికింది. వివాహ ముహూర్తానికి దాదాపు 12 గంటల ముందే వేదికను చేరుకున్న చంద్రబాబు పెళ్లి పనుల గురించి ఆరా తీసి సందడి చేశారు. వివాహం అనంతరం మధ్యాహ్నం 2 గంటల తరువాత ఆయన తిరిగి విజయవాడకు వెళ్లనున్నారు. కాగా, విమానాశ్రయంలో చంద్రబాబును పలు ప్రశ్నలు అడిగేందుకు మీడియా ప్రయత్నించగా, తాను కుటుంబ కార్యక్రమానికి వచ్చానని, ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం తగదని చెప్పారు. కాగా, 2014లో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తమిళనాడులో పర్యటించడం ఇది రెండోసారి.

  • Loading...

More Telugu News