: విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన అమలాపాల్, దర్శకుడు విజయ్


మనస్పర్థల కారణంగా గతేడాది మార్చి 3 నుంచి వేరుగా ఉంటున్న నటి అమలా పాల్, దర్శకుడు విజయ్ ఆనంద్ విడాకుల కోసం ఈరోజు చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. హిందు వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ముందు వీరు హాజరయ్యారు. తమకు విడాకులు మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. అమలా పాల్, విజయ్ ఆనంద్ లకు విడాకులు మంజూరు చేయడానికి రిజస్ట్రీని సంప్రదించి అన్ని ప‌త్రాలను త‌మ‌కు స‌మ‌ర్పించాల్సిందిగా న్యాయ‌మూర్తి సూచించారు. నేడు వారు కోర్టుని ఆశ్ర‌యించ‌డంతో చ‌ట్ట‌ నిబంధ‌న‌ల ప్రకారం నేటి నుంచి ఆరు నెలల కాలవ్యవధిని వారికి ఇస్తారు. వ్య‌వ‌ధి ముగిసిన అనంత‌రం వారిద్ద‌రి అంగీకారంతో విడాకులు మంజూరు చేస్తారు. వీరిరువురు 2014 జూన్ 12న ప్రేమవివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News