: ‘హోదా’ కోసం బాలయ్య అభిమాని ఆమరణ దీక్ష
ఏపీకి ప్రత్యేక హోదా కోసం టాలీవుడ్ అగ్ర నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొన్న హైదరాబాదులో గళం విప్పిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, లేదంటే ఫలితం అనుభవిస్తారంటూ ఆయన బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించారు. బాలయ్య ప్రకటన నేపథ్యంలో విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన ఆయన వీరాభిమాని చింతకాయల రాంబాబు వినూత్న నిరసనకు దిగారు. పట్టణంలో టెంటు వేసుకున్న ఆయన ఆమరణ దీక్షకు దిగారు. ఏపికి ప్రత్యేక హోదా ప్రకటించేదాకా తాను దీక్ష విరమించేది లేదని ఆయన ప్రకటించారు. రాంబాబు దీక్షకు బాలయ్య అభిమానులతో పాటు పాయకరావుపేట వాసులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు.