: ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసింది... ఈరోజు ఎన్డీఏ న్యాయం చేయాలి: సీఎం చంద్రబాబు
ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని, ఈరోజు ఎన్డీఏ న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ఏపీ డిమాండ్లు పూర్తిగా పరిష్కరించే వరకు తాము రాజీ పడకుండా పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని ఆయన కోరారు. ‘ఒక పేపరుంది దాని పేరు సాక్షి.. ఓ నవలలా అది మాపై ఏవేవో రాతలు రాస్తోంది.. అది చదివితే మీ మనసు కలుషితం అవుతుంది. దాన్ని ఎవ్వరూ చదవకపోతే అది మూతపడుతుంది. పట్టిసీమ ప్రాజెక్టు అసాధ్యమన్నారు. ఇప్పుడు నిజం చేసి చూపించాం. రాష్ట్రాన్ని కరవురహిత ప్రాంతంగా చేయడమే నా లక్ష్యం’ అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.