: కృష్ణా పుష్కరాల్లో అపశ్రుతి!... విద్యుత్ షాక్ తో కార్మికుడి దుర్మరణం!


కృష్ణా పుష్కరాలు ప్రారంభం కాకముందే అపశ్రుతి చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా ప్రధాన నగరం విజయవాడ పరిధిలో పుష్కరాల కోసం చేస్తున్న ఏర్పాట్లలో ఈ ఘటన కొద్దిసేపటి క్రితం జరిగింది. పుష్కరాలకు విద్యుద్దీపాల అలంకరణలో భాగంగా విద్యుత్ స్తంభం ఎక్కిన కార్మికుడు భాగ్యరాజు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. కరెంట్ షాక్ కారణంగా స్తంభంపై నుంచి పడిపోయిన భాగ్యరాజు అక్కడికక్కడే చనిపోయాడు. ఆమధ్య గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న భారీ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు అత్యంత జాగరూకతతో పనులను కొనసాగిస్తున్నా ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో అధికార యంత్రాంగం దిగ్భ్రాంతికి గురైంది.

  • Loading...

More Telugu News