: నేడు ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతి!... నివాళి అర్పించిన కేసీఆర్
తెలంగాణ ఉద్యమానికి ఎప్పటికప్పుడు కొత్త ఊపిరిలూదిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలంగాణ కల సాకారమవుతున్న వేళ ఆయన చనిపోయారు. ఈ క్రమంలో ఆయనపై ప్రజల్లో మరింత ఆదరణ వ్యక్తమైంది. ఈ క్రమంలో నేడు జయశంకర్ 82వ జయంతి వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళి అర్పించారు.