: గోదావరి అంత్య పుష్కరాలకు వరద ముప్పు!... ఘాట్లలో ఒకటో ప్రమాద హెచ్చరికలు జారీ!
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి అంత్య పుష్కరాలకు వరద ముప్పు పొంచి ఉంది. తెలంగాణ, ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం గోదావరి అంత్య పుష్కరాలు జోరుగా సాగుతున్నాయి. వేలాది మంది భక్తులు ఆయా ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రికి ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల నుంచి విడుదలైన భారీ నీటి ప్రవాహంతో పుష్కర ఘాట్లలోకి వరద నీరు చేరిపోయింది. దీంతో పుష్కర ఘాట్లలో ఒకటో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు వరద ప్రవాహం భారీగా చేరిన ఐదు పుష్కర ఘాట్లను అధికారులు మూసేశారు. మిగిలిన ఘాట్లలోనూ జాగరూకతతో స్నానాలు చేయాలని భక్తులకు హెచ్చరికలు జారీ అయ్యాయి.