: ఈ నెల 27న ఢిల్లీలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశం
భారతీయ జనతా పార్టీ దేశంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, జీఎస్‌టీ బిల్లుపై చర్చించడమే లక్ష్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ఈనెల 27న ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి నాలుగు రోజుల ముందు కూడా తమ పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. సమావేశంలో ముఖ్యమంత్రులతో ప్రధానంగా జీఎస్‌టీ బిల్లు, ప్రభుత్వానికి- బీజేపీకి మధ్య సమన్వయం, దేశంలో పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కొనసాగిస్తోన్న పథకాల ప్రచారం తదితర అంశాలపై అమిత్ షా చర్చించనున్నారు.