: ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజ్యసభలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడొద్దని తాము ప్రధాని మోదీకి వివరించినట్లు ఆయన తెలిపారు. విభజన హామీలపై మోదీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. హోదా, రాష్ట్ర సమస్యలపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రానికి ఎంతో నష్టం వస్తుందని ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రధాని చెప్పారని ఆయన అన్నారు. హోదాపై కేంద్రం త్వరగా ఓ నిర్ణయం తీసుకుంటేనే రాష్ట్రానికి ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు.