: యువతకు అన్యాయం జరుగుతోంది: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మోదీ, కేసీఆర్ పాలనలో యువతకి ఏమాత్రం మేలూ జరగలేదని, ఎక్కడ చూసినా యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయి కనిపిస్తున్నారని అన్నారు. ఇంటికో ఉద్యోగం కాదు.. ఊరికో ఉద్యోగం కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ నినాదాలకే పరిమితమయిందని ఆయన విమర్శించారు. గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని బీజేపీ ప్రయత్నించిందని వ్యాఖ్యానించారు.