: బొండా ఉమ వినూత్న నిరసన
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏపీ ప్రజలు ఎదుర్కుంటోన్న కష్టాలను రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం ముందు ఉంచాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడలోని సూర్యారావుపేట బీజేపీ ఆఫీసు ముందు ఆయన పలువురు నేతలు, కార్యకర్తలతో కలిసి రోడ్లను ఊడ్చారు. అక్కడి బీజేపీ నేతల కార్లు సహా ఇతరుల వాహనాలను కూడా తుడిచారు. వారికి గులాబీ పూలను కూడా అందించారు. రెండేళ్లుగా బీజేపీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనే అంటున్నారని ఆయన అన్నారు.