: మీలా లెక్కిస్తే ఏ బిల్లయినా మనీ బిల్లే: దుయ్యబట్టిన కపిల్ సిబల్


అరుణ్ జైట్లీ చెబుతున్నట్టుగా లెక్కిస్తే, లోక్ సభ, రాజ్యసభకు వచ్చే ప్రతి బిల్లూ మనీబిల్లేనని మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ ప్రసంగించిన ఆయన, జైట్లీ ఉటంకిస్తున్న ఆర్టికల్ 100తో తాను ఎట్టి పరిస్థితుల్లోను ఏకీభవించబోనని స్పష్టం చేశారు. సభ్యుల హక్కులను కాలరాయాలని జైట్లీ గట్టిగా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక బిల్లుపై ఎప్పుడైనా అభ్యంతరాలు లేవనెత్తవచ్చని తెలిపారు. పార్లమెంటుకు వచ్చే ప్రతి బిల్లు కూడా ఏదో ఒక రూపంలో సంఘటిత నిధికి సంబంధించినదే అయి ఉంటుందని, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డబ్బుతో సంబంధం లేని బిల్లు అసలు ఉండనే ఉండదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఉద్దేశం లేకుంటే దాన్నే స్పష్టంగా చెప్పాలని, అంతే తప్ప సభను తప్పుదారి పట్టించ వద్దని హితవు పలికారు.

  • Loading...

More Telugu News