: దేవుడా! అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించు!: రాజ్యసభలో రాజ్‌నాథ్‌సింగ్
తన పాకిస్థాన్ పర్యటనలో భాగంగా అక్కడ చోటుచేసుకున్న పరిణామాలు, సార్క్ సదస్సు వివరాల గురించి ఈరోజు రాజ్యసభలో వివరించిన హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... ఈ సందర్భంగా పాకిస్థాన్ దుర్నీతిని గురించి వివరిస్తూ ‘దేవుడా, అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించు’ అని వ్యాఖ్యానించారు. ‘చట్టాలనుంచి ఉగ్రవాదులు తప్పించుకోకుండా చూడాలని సార్క్ సదస్సులో కోరాను.. తీవ్రవాదులపై ప్రపంచ దేశాలన్నీ సమ్మతించిన ఆంక్షలను అన్ని దేశాలు అమలు పరచాలని చెప్పాను. ఉగ్రవాదులకు తోడ్పడే దేశాలపై చర్యలు తీసుకోవాలని అన్నాను. తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులపై సమగ్ర విచారణ జరపాలని వ్యాఖ్యానించాను. నిరసనలకు పాల్పడతారని తెలిస్తే పాక్‌కి వెళ్లేవాడిని కాదు. నేను హెలికాఫ్టర్‌లో హోటల్ కి వెళ్లినప్పుడు కొందరు ప్రజలు నాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. దేవుడా, అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించు’ అని ఆయన వ్యాఖ్యానించారు.