: జీవో 123పై వాదనలు విన్న హైకోర్టు.. రైతులకు న్యాయం చేస్తామన్న సర్కార్... విధివిధానాలతో రమ్మన్న కోర్టు!
జీవో 123ను హైకోర్టు రద్దు చేసిన అంశంపై తెలంగాణ సర్కారు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసిన విషయం తెలిసిందే. లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన డివిజన్‌బెంచ్ ప్రభుత్వం చేసిన అప్పీలుపై విచారణ జరిపి సర్కారు వాదనలు వింది. రైతుల హక్కులకు భంగం కలిగించబోమని తెలంగాణ సర్కారు తరఫు న్యాయవాది తెలిపారు. షెడ్యూల్ 2 ప్రకారం వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. జీవోపై విధివిధానాలు రూపొందించుకుని తిరిగి రావాలని హైకోర్టు ప్రభుత్వానికి తెలిపింది. ప్రభుత్వం అప్పీలుపై సోమవారం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పింది.