: పోలీస్ అధికారి సాహసం... కొండ అంచునుంచి కేవలం కాళ్ల సాయంతో తలకిందులుగా వేలాడిన వైనం
ఆన్‌లైన్‌లో ఓ యూజర్ పోస్ట్ చేసిన ఫోటోను స్ఫర్తిగా తీసుకొని బ్రెజిల్‌లోని రియో డిజెనీరోలో లుయీజ్ ఫెర్నాండో క్యాండియా అనే 27 ఏళ్ల పోలీస్ అధికారి ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎత్తైన కొండ అంచు భాగంలో కాళ్ల సాయంతో తలకిందులుగా వేలాడుతూ లుయీజ్ ఫెర్నాండో అత్యద్భుత సాహసం చేశాడు. ఆయన కింద మూండొందల ఫీట్ల అడుగులో సముద్రం ఉంది. రియో డిజెనీరోలో త్వరలోనే ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. క్రీడలకు ప్రారంభం కావడానికి ముందు ఆయన చేసిన ఈ సాహసం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొండ అంచునుంచి వేలాడుతోన్న ఆయన సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. లూయిజ్ ఈ సాహసం చేయడానికి తన మిత్రుడి సాయం తీసుకున్నాడు. తాడుతో ముందుగా కొండ అంచుకు చేరుకున్నాడు. తరువాత కేవలం కాళ్ల సపోర్ట్తోనే కొండ అంచుకు వేలాడుతూ తన మిత్రుడితో ఫోటోలు తీయించుకొని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. తన సాహసం అయిపోయిన తరువాత మిత్రుడి సాయంతోనే కొండ అంచునుండి తిరిగి వచ్చినట్లు లూయీజ్ చెప్పాడు.