: సౌదీలో పట్టుబడ్డ డా.సబీల్ అహ్మద్... ఉగ్రవాదులకు తీవ్ర నష్టమే!


అల్ ఖైదా, లష్కరే తోయిబా సంస్థల్లో ఉగ్రవాదులుగా యువతను చేర్చే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డా. సబీల్ అహ్మద్ ను సౌదీ అరేబియా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. సబీల్ అరెస్ట్ ఉగ్రవాదులకు తీవ్ర నష్టాన్ని కలిగించేదేనని అధికారులు భావిస్తున్నారు. 2007లో గ్లాస్గో ఎయిర్ పోర్టులో బాంబులు పేల్చిన కఫీల్ అహ్మద్ సోదరుడే సబీల్. బెంగళూరుకు చెందిన సబీల్ ను, జూన్ 30, 2007న యూకేలోని లివర్ పూల్ పోలీసులు అరెస్ట్ చేసి 2008లో ఇండియాకు డిపోర్ట్ చేయగా, భారత పోలీసులు అతనిపై గట్టి నిఘా పెట్టడంలో విఫలమయ్యారు. దీంతో సబీల్ మరోసారి దేశం దాటేశాడు. ఇప్పుడిక సౌదీలో అతను పట్టుబడ్డాడని తెలియడంతో, అతన్ని ఇండియాకు అప్పగించాలని భారత అధికారులు సౌదీ ప్రభుత్వాన్ని కోరాలని భావిస్తున్నారు. సబీల్ అరెస్ట్ పై సౌదీ అధికారిక ప్రకటన చేయాల్సి వుంది.

  • Loading...

More Telugu News