: జూరాలకు భారీ వరద... 2 లక్షల క్యూసెక్కులు దాటిన ప్రవాహం


అధికారులు రెండు రోజుల క్రితం ఊహించినట్టుగానే మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో కురిసిన భారీ వర్షాలు వరదగా మారాయి. ఎగువన ఉన్న జలాశయాలు నిండుకుండగా మారగా, ఆ నీరంతా శ్రీశైలానికి చేరుతోంది. నిన్న జూరాల వద్ద లక్ష క్యూసెక్కులుగా నమోదైన వరద నీరు నేడు ఉదయం 11 గంటల సమయానికి 2.30 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. జూరాల ప్రాజెక్టు 13 గేట్లు తెరచి నదిలోకి 1.82 లక్షల క్యూసెక్కులను అధికారులు వదులుతున్నారు. మిగతా అదనపు నీటిని కాలువల ద్వారా పంపుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.08 అడుగుల మేరకు నీరుంది.

  • Loading...

More Telugu News