: రాజ్యసభలో సార్క్ సదస్సు అంశాల‌ గురించి వివ‌రించిన రాజ్‌నాథ్‌సింగ్


పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో నిన్న జ‌రిగిన సార్క్ హోంమంత్రుల స‌దస్సును గురించి రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వివ‌రించారు. స‌దస్సులో ఉగ్ర‌వాదం, సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్ పై ప్రధానంగా చ‌ర్చ జ‌రిగిందని ఆయ‌న పేర్కొన్నారు. తాను ఉగ్ర‌వాదంపై ప్ర‌సంగం చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఉగ్ర‌వాదం ప‌ట్ల ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఉగ్ర‌వాదం మాన‌వ‌హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు శ‌త్రువు లాంటిద‌ని తాను వ్యాఖ్యానించిన‌ట్లు చెప్పారు. ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించేలా ప్ర‌వ‌ర్తిస్తోన్న దేశాలు, సంస్థ‌ల తీరును ఖండించాల్సిందేన‌ని తాను పేర్కొన్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News