: భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి హుండీలో కాసుల వర్షం కురుస్తోంది. అటు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా అధికంగా అమ్ముడు పోతున్నాయి. దీంతో ఆపదమొక్కుల వాడి ఆదాయం రోజురోజుకీ పెరిగిపోతూనే వస్తోంది. గత నెలలో వెంకన్నకు భక్తులు సమర్పించిన ఆదాయంపై టీటీడీ ఈవో సాంబశివరావు తాజాగా మీడియాకు వివరించారు. గత నెలలో వెంకన్న హుండీ ఆదాయం ఏకంగా రూ.97.20 కోట్లు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తిరుమలేశుని ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం కూడా భారీ సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారని, ఆ టిక్కెట్లతో 6.27 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఆయన వెల్లడించారు.