: 26/11 ముంబై దాడుల కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన పాకిస్థాన్
2008లో జరిగిన ముంబై దాడుల కీలక నిందితుడుగా భావిస్తున్న సుఫియాన్ జాఫర్‌ను పాకిస్థాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేసినట్టు గురువారం రాత్రి పొద్దుపోయాక పాక్ ప్రభుత్వం వెల్లడించింది. 2008లో జరిగిన ఈ దాడిలో విదేశీయులు సహా 160 మంది మృతి చెందగా దాదాపు 308 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ముంబై దాడుల కీలక నిందితుడుగా భావిస్తున్న సుఫియాన్ జాఫర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు యాంటీ టెర్రరిజం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 8 రోజుల రిమాండ్ విధించింది. డైరెక్టర్ మజ్హర్ కాకాఖేల్ ఆధ్వర్యంలోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) బృందం నిందితుడిని ఇంటరాగేట్ చేయనుంది.