: దంతెవాడలో భారీ ఎన్ కౌంటర్!... ముగ్గురు మావోయిస్టుల హతం!


ఛత్తీస్ గఢ్ లోని అడవుల్లో నేటి తెల్లవారుజామున తుపాకుల మోత మారుమోగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. నిషేధిత మావోయిస్టుల ఏరివేత కోసం రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలోని అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. వెనువెంటనే ఇరువర్గాలు పరస్పరం కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టమే జరిగింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. అక్కడ ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News