: ప్రకాశం జిల్లాలో సాగర్ కాలువకు గండి!... వృథాగా పోతున్న నీరు!


ఏపీలోని సాగునీటి సరఫరాలో కీలక భూమిక పోషిస్తున్న ప్రధాన కాలువలకు గండ్లు పడిపోతున్నాయి. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం కుడి కాలువకు పడిన గండి ఏపీ సర్కారును ఉరుకులు పరుగులు పెట్టించింది. తాజాగా ప్రకాశం జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజక్టులో భాగంగా కీలకమైన కుడి కాలువకు గండి పడింది. జిల్లాలోని బల్లికురువ మండలం కొమ్మినేనివారిపాలెం వద్ద పడిన ఈ గండి కారణంగా పెద్ద ఎత్తున సాగు నీరు వృథాగా పోతోంది. సమాచారం అందుకున్న జలవనరుల శాఖ ఈ గండిని పూడ్చేందుకు రంగంలోకి దిగింది.

  • Loading...

More Telugu News