: 7న లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ ల మూసివేత
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఈ నెల 7న నగరంలోని లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ లను మూసివేయనున్నారు. ఈ మేరకు అధికారులు నిర్ణయించారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా భద్రతా కారణాల రీత్యా వీటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీజేపీ కార్యకర్తల సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.