: పారిశుద్ధ్య కార్మికుడికి కేటీఆర్ ఘనసన్మానం.. రూ.1,11,111 చెక్కు అందజేత
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుడు వెంకటయ్య (49) జాతీయస్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఇటీవల ఎంపికయిన విషయం తెలిసిందే. ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులుగా కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని ఎంపిక చేస్తే వారిలో హైదరాబాద్కు చెందిన వెంకటయ్య ఒకరుగా నిలిచారు. ఎల్లుండి ప్రారంభించనున్న ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డును అందుకోనున్న ఆయనను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు ఘనంగా సన్మానించారు. 16 ఏళ్ల సర్వీసులో ఒక్క సెలవు కూడా పెట్టకుండా సేవలు అందించిన ఆయనను కేటీఆర్ ప్రశంసించారు. వెంకటయ్యకు రూ.1,11,111 చెక్కును కేటీఆర్ అందజేశారు.