: ఆఫ్గానిస్థాన్‌లో విదేశీ పర్యాటకుల వాహనశ్రేణిపై ఉగ్రవాదుల దాడి
భీకరదాడులు చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఉగ్రవాదులు ప్రతిరోజూ ఏదో ఒక చోట రెచ్చిపోతూనే ఉన్నారు. ఆఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు ఈరోజు మరోసారి రెచ్చిపోయారు. హెరాత్ ప్రావిన్స్ లోని విదేశీ పర్యాటకుల వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. ఉగ్రదాడితో నలుగురు విదేశీ పర్యాటకులకు తీవ్రగాయాలయినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు హెరాత్ ప్రావిన్స్ ని లక్ష్యంగా చేసుకొని వరసగా దాడులు చేస్తున్నారు. ఈ ప్రాంతం ఇరాన్ సరిహద్దుల్లో ఉంటుంది. సురక్షిత నగరంగా భావించే ఆ ప్రాంతంపై వరసగా జరుగుతోన్న దాడుల పట్ల స్థానికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.