: హిల్లరీని ఐసిస్ ఫౌండర్ అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు


రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్, తన ప్రత్యర్థి, డెమోక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ పై గతంలో పలు వ్యాఖ్యలు చేశారు. హిల్లరీని మోసకారని, దెయ్యం అంటూ చేసిన వ్యాఖ్యలు నేడు మరింత తీవ్ర స్థాయికి చేరారు. ఫ్లోరిడాలోని ఒక ప్రచార ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ హిల్లరీని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ వ్యవస్థాపకురాలంటూ వ్యాఖ్యానించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై 9/11 ఉగ్రదాడి జరిగి ఉండేది కాదని అన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఉగ్ర సంఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఐఎస్ ను ఈ స్థాయిలో దాడులు చేయనిస్తున్నామంటూ ట్రంప్ తనదైన శైలిలో మాట్లాడారు.

  • Loading...

More Telugu News