: తూ.గో జిల్లాలో అమానుషం.. బతికివుండగానే తల్లిని శ్మశానంలో వదిలేసిన తనయుడు
మనుషుల్లో రోజురోజుకీ మానవత్వం దిగజారిపోతోంది. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని కూడా పుత్రరత్నాలు పట్టించుకోని ఘటనలు కనపడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఇలాంటి అమానుష ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకొచ్చింది. బతికివుండగానే తల్లిని శ్మశానంలో వదిలేశాడో తనయుడు. శ్మశాన వాటికలో నీరసంగా పడివున్న మహిళను గుర్తించిన స్థానికులు ఆమె గురించి ఆరా తీయగా ఈ విషయం వారికి తెలిసింది. ఘటన పట్ల స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ మహిళను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.