: అమరావతి నిర్మాణానికి కేంద్రం కొర్రీలు!... అటవీ భూములకు అనుమతులపై ఎఫ్ఏసీ వితండ వాదన!


ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తన మొండి వైఖరికే కట్టుబడ్డ కేంద్ర ప్రభుత్వం... నవ్యాంద్ర నూతన రాజధాని నిర్మాణానికి కూడా మోకాలొడ్డుతోంది. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎదురవుతున్న ఈ అడ్డగింతలపై ఏపీ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకెళితే... గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో అమరావతి పేరిట నిర్మాణం కానున్న ఏపీ రాజధానికి 33 వేలకు పైగా భూమిని సీఆర్డీఏ సేకరించింది. ఈ భూమి మొత్తం రైతులకు చెందినదే. దీనికి తోడు అక్కడి చుట్టుపక్కల ఉన్న 13,267.12 హెక్టార్ల అటవీ భూమిని కూడా రాజధాని కోసం డీనోటిఫై చేయాలని సీఆర్డీఏ అధికారులు కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని అటవీ సలహా కమిటీ (ఎఫ్ఏసీ)కి లేఖ రాశారు. ఇందుకు ప్రాథమిక అనుమతులు మంజూరు చేసిన ఎఫ్ఏసీ... రెండో దఫా అనుమతుల జారీ కోసం మాత్రం నానా పేచీలు పెడుతోంది. డీనోటిఫై కోరుతున్న భూములను ఏ విధంగా వినియోగిస్తారు? ఏఏ తరహా నిర్మాణాలు కడతారు? అంటూ ప్రశ్నలు సంధిస్తోంది. ఈ మేరకు సీఆర్డీఏ ఇటీవల రాసిన లేఖకు స్పందించేందుకు ససేమిరా అన్ని ఎఫ్ఏసీ... తాము అడిగిన అన్ని వివరాలు ఇవ్వాలని ఆ లేఖను తిరుగు టపాలో పంపిందట.

  • Loading...

More Telugu News