: భారత్, పాక్ హోం మంత్రుల చేతులు తగిలాయంతే... కనీసం షేక్ హ్యాండ్ కూడా కాదు!


ఇస్లామాబాద్ లో జరుగుతున్న సార్క్ సమావేశాలకు రాజ్ నాథ్ సింగ్ వెళ్లిన వేళ, ఆ దేశ హోం మంత్రి నిసార్ అలీ ఖాన్ కలిశారు. సార్క్ సమావేశపు వేదిక సెరీనా హోటల్ కు రాజ్ నాథ్ వెళ్లిన వేళ, అతిథులకు స్వాగతం పలికేందుకు నిసార్ అక్కడే నిలబడి వున్నారు. కనీసం చిరునవ్వు కూడా ఇద్దరు నేతల ముఖాలపై కనిపించలేదు. వీరిద్దరి చేతులూ ఒకదానికి ఒకటి తాకాయంతే, అది కనీసం మర్యాదపూర్వక షేక్ హ్యాండ్ కూడా కాదు. ఆపై రాజ్ నాథ్ సమావేశపు మందిరంలోకి వెళ్లిపోయారు. గత కొంతకాలంగా కాశ్మీర్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటం, పాక్ ప్రభుత్వం కాశ్మీర్ లోయలో అశాంతిని పెంచుతున్న నేపథ్యంలో సార్క్ సమావేశాల్లో పాక్ పన్నాగాలను రాజ్ నాథ్ మిగతా దేశాల దృష్టికి తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News