: ఓ వైపు విమానంలో మంటలు... కిందకు దూకాలని మొత్తుకుంటున్నా వినకుండా బ్యాగుల కోసం టైమ్ వేస్ట్ చేసిన ప్రయాణికులు... వీడియో వైరల్


నిన్న దుబాయ్ లో క్రాష్ ల్యాండింగ్ అయి మంటల్లో చిక్కుకున్న విమానం లోపల ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎమిరేట్స్ విమానంలో మంటలు చెలరేగి, ఆపై అది సురక్షితంగా ల్యాండయిన తరువాత, విమానంలోని సిబ్బంది అత్యవసర గేట్లను తెరచి, అందరినీ వేగంగా కిందకు దూకాలని కేకలు పెడుతుంటే, ప్రయాణికులు తాపీగా పై నుంచి తమ సామాన్లు తీసుకుంటూ సమయాన్ని వృథా చేశారు. ఓ పాసింజర్ 'నా ల్యాప్ టాప్... ల్యాప్ టాప్' అని అంటుండటం కూడా ఈ వీడియోలో వినిపించింది. అప్పటికే ఓ ఇంజన్ నుంచి మంటలు చెలరేగి, ఏ క్షణమైనా విమానం మొత్తానికీ మంటలు అంటుకోవచ్చన్న భయాల మధ్య, ప్రయాణికులను రక్షించేందుకు 'జంప్ ది స్లైడ్... జంప్ ది స్లైడ్' అని ఓ ఎయిర్ హోస్టెస్ కేకలు పెడుతుంటే, చాలా మంది తాపీగా ఉండటం, వారికి విమాన ప్రమాదాల పట్ల కనీస అవగాహన లేదన్న విమర్శలను పెంచుతోంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News