: నరసరావుపేటలో హోదా కోసం రోడ్డెక్కిన కోడెల కుమారుడు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించాలని కోరుతూ, అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. వందలాది మంది కార్యకర్తలతో రోడ్డెక్కిన శివరాం బస్టాండు నుంచి పల్నాడు సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెంటనే రాష్ట్రానికి హోదాను ప్రకటించి, విభజన గాయాలు మానేలా చూడాలని డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకుంటే ప్రజల నుంచి మరింత తీవ్రమైన నిరసన ఉద్యమాలు చెలరేగుతాయని హెచ్చరించారు. కాగా, నరసరావుపేట పరిధిలో పరిచయం అక్కర్లేని నేత కుమారుడిగా గుర్తింపున్న శివరాంను 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దింపేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో శివరాం నేతృత్వంలో పేట పరిధిలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News