: ‘హోదా’ కోసం భిక్షాటన చేసిన ‘గాలి’!... వడమాలపేటలో జోలెపట్టి రూ.15 వేలు సేకరించిన టీడీపీ ఎమ్మెల్సీ!
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కొద్దిసేపటి క్రితం వినూత్న నిరసనకు దిగారు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో జోలె పట్టి భిక్షాటన చేసిన గాలి ఏకంగా రూ.15 వేలు సేకరించారు. ఈ నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ కు జమ చేస్తానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలు కొత్త కోర్కెలు ఏమీ కోరడం లేదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన తరహాలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించకుండా రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆయన కోరారు.