: ఇంత అన్యాయమూ? సుప్రీంకోర్టుకు వెళ్తాం: కేజ్రీవాల్


ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను సవాల్ చేస్తూ, హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకోలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కేంద్ర అధీనంలో ఉన్నవేళ, తమ ప్రభుత్వానికి అన్యాయం జరుగుతోందని, నిత్యమూ ప్రజాప్రతినిధులను అరెస్టుల పేరుతో ఎన్డీయే సర్కారు వేధిస్తోందని ఇప్పటికే పలుమార్లు ఆరోపించిన కేజ్రీవాల్ సర్కారు, తాజా హైకోర్టు తీర్పుతో డీలా పడింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం కిందే పోలీసు వ్యవస్థ ఉండేలా చేయాలన్నదే తమ అభిమతమని, అవసరమైతే దీనికోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని కొద్దిసేపటి క్రితం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News