: దేవినేని నెహ్రూ ‘సైకిల్’ సవారీకి గ్రీన్ సిగ్నల్!... చంద్రబాబు సరేనంటే తమకేమీ అభ్యంతరం లేదన్న కృష్ణా జిల్లా నేతలు!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) టీడీపీలో చేరికకు లైన్ క్లియర్ అయ్యింది. దేవినేని నెహ్రూతో పాటు కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో కీలక నేత బూరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న విషయం తెలిసిందే. దేవినేని నెహ్రూ చేరికకు సంబంధించి టీడీపీ ఏపీ చీఫ్ కిమిడి కళా వెంకట్రావు కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బోడె ప్రసాద్ తదితరులతో చర్చించారు. దేవినేనిని పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా సుముఖంగానే ఉన్నట్లు కళా వారికి తెలిపారు. దేవినేని చేరికతో జిల్లాలో పార్టీ దుర్బేధ్యంగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారట. సాక్షాత్తు పార్టీ అధినేతే దేవినేని చేరికకు సుముఖంగా ఉన్నప్పుడు తామెందుకు కాదంటామంటూ వారంతా ముక్తకంఠంతో ఓకే చెప్పేశారట. దీంతో దేవినేని నెహ్రూ టీడీపీ ఎంట్రీకి దాదాపుగా అడ్డంకులన్నీ తొలగిపోయాయి. త్వరలోనే ఆయన చంద్రబాబుతో భేటీ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం సమయంలో ఆ పార్టీలోనే ఉన్న దేవినేని నెహ్రూ పార్టీలో చీలిక వచ్చిన సమయంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వెంట నడిచారు. ఆ తర్వాత ఒంటరిగా మారిన ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజాగా ఆయన తన సొంత గూడు టీడీపీలోకి చేరిపోయేందుకు మార్గం సుగమమైంది.

  • Loading...

More Telugu News