: కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ... పోలీసులు కేంద్ర పరిధిలోనేనన్న హైకోర్టు


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధానిలో శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసు వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ ఉండరాదని తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు, పోలీసు వ్యవస్థ నిర్వహణ తదితరాంశాలపై ఆప్ సర్కారు హైకోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితం తీర్పును వెలువరించారు. ఎల్జీ అధికారాలను తగ్గించలేమని, దేశం నలుమూలల నుంచి ఎందరో వీఐపీలు వచ్చి వెళుతుండే రాజధానిలో భద్రత కేంద్రం చేతుల్లో ఉంటేనే మంచిదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News