: రవికతో రికార్డులకెక్కిన బెంగళూరువాసి అనురాధ


సాధారణానికి భిన్నంగా ఉండడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వినూత్నంగా ఆలోచించి సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంటారు. బెంగళూరుకు చెందిన అనురాధ అనే మహిళ కూడా ఇలా ఆలోచించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. లేడీస్ స్పెషలిస్టు టైలర్ అయిన అనురాధకు చేస్తున్న పనిలోనే విభిన్నంగా ప్రయత్నించి పేరుతెచ్చుకోవచ్చుకదా అనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆమె అందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పూల ప్రింట్లు గల పెద్ద వస్త్రంతో 30 అడుగుల పొడవున్న రవికను కుట్టడం ప్రారంభించారు. ఈ జాకెట్ అంచుకుట్టేందుకు 20 మీటర్ల పాలిస్టర్ వస్త్రం ఖర్చయిందని ఆమె చెప్పారు. ఈ మొత్తం జాకెట్ కుట్టేందుకు ఆరు రోజులు పట్టగా, ప్రతి రోజూ ఐదుగురు సహాయకులతో రోజుకు 12 గంటల చొప్పున కుట్టాల్సి వచ్చిందట. మూడు రోజుల క్రితమే దీనిని కుట్టడం పూర్తయినప్పటకీ గిన్నిస్‌ ప్రతినిధులు దీనిని అతిపెద్ద రవికగా తాజాగా గుర్తింపునిచ్చారు. దీంతో అనూరాధ ఉబ్బితబ్బిబ్బవుతోంది.

  • Loading...

More Telugu News