: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే 10 వేలు ఫైన్ కట్టాల్సిందే: కేంద్ర కేబినెట్ నిర్ణయం


చుక్కేసి డ్రైవింగ్ చేసే మందుబాబులకు కేంద్ర కేబినేట్ ఝలక్కిచ్చింది. మద్యం తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా విధించాలని కేబినేట్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సీట్ బెల్టు పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల జరిమానా, హెల్మెట్ లేకుంటే 2 వేల రూపాయల జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ తో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే 500 జరిమానా విధించనున్నారు. అలాగే జువైనల్స్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే వారి గార్డియన్స్ కు 25 వేల రూపాయలు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. డ్రైవర్లు మద్యం మత్తులో జరిపే యాక్సిడెంట్లను అదుపు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్ని రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనుంది.

  • Loading...

More Telugu News