: పన్ను నిర్ణయంలో కేంద్ర గుత్తాధిపత్యం ఉంటుందన్నది అసత్యం: అరుణ్ జైట్లీ


పన్ను నిర్ణయంలో కేంద్ర గుత్తాధిపత్యం ఉంటుందన్నది అసత్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈరోజు రాజ్యసభలో వస్తు, సేవల పన్ను (జీఎస్ టీ) బిల్లుపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ, పన్ను నిర్ణయాక మండలిలో మూడింట రెండొంతుల మంది రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారని, మూడింట ఒక వంతు మాత్రమే కేంద్ర ప్రతినిధులు ఉంటారని అన్నారు. పన్ను నిర్ణయాక మండలిలో కేంద్ర ప్రభుత్వానికి వీటో అధికారం ఉంటుందనేది అవాస్తవమన్నారు. పన్ను నిర్ణాయక మండలి చేసిన సిఫార్సుల ఆధారంగానే కేంద్రం పన్ను చట్టాలు చేస్తుందని, జీఎస్ టీ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే బిల్లు తెచ్చామన్నారు. దేశంలోని 55 శాతం వస్తువులపై 14 శాతం వ్యాట్ ఉందని, కేంద్ర పన్నులు, వ్యాట్ కలిపి 27 శాతం వరకు ఉన్నాయని జైట్లీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News