: బికినీ, హైహీల్స్ వేసుకొచ్చిన మగాళ్లను చూసి షాక్ తిన్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు!


ఒక ఆఫర్ పెట్టి, వందలాది మంది వినియోగదారులను ఆకట్టుకోవడం వ్యాపారసూత్రం. ఈ సూత్రం విఫలమైన సందర్భాలు లేవనే చెప్పాలి. రష్యాలోని ఒబ్లాస్ట్‌ లో ప్రారంభమైన పెట్రోల్‌ బంక్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బికినీ, హైహీల్స్ వేసుకుని వచ్చిన వారికి జూలై 21న మూడు గంటపాటు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీ అని ప్రకటించింది. తాము ప్రకటించిన సమయంలో బికినీలో వచ్చిన వారు తమను అడగాల్సిన అవసరం లేదని, నేరుగా పెట్రోలు, డీజిల్ నింపుకుని వెళ్లిపోవచ్చని ప్రకటించింది. అంతే... బికినీలు వేసుకుని కార్లలో వచ్చిన వినియోగదారులు అక్కడ క్యూకట్టేశారు. ఈ క్యూ మొత్తం ఆడవాళ్లతో నిండిపోతే బాగుండేదేమో కానీ, ఆ క్యూలో మగాళ్లు కూడా బికినీ, హైహీల్స్ వేసుకుని నిలబడడం విశేషం. దీంతో షాపు యజమాని షాక్ తిన్నాడు. మూడు గంటలపాటు ఆడా, మగా అన్న తేడా లేకుండా బికినీలో వచ్చి పెట్రోలు పోసుకుని హ్యాపీగా వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News