: ‘పోకేమాన్’తో కళకళలాడుతున్న గుర్గావ్ పార్క్!


‘పోకేమాన్’ మొబైల్ గేమ్ తో ఇప్పటివరకు ఎన్నో అనుభవాలు చవిచూసిన వారున్నారు. వాటిలో అధికశాతం చేదు అనుభవాలే ఉన్నాయి. కానీ, ఈ గేమ్ తో గుర్గావ్ లోని ఒక పార్క్ కు మాత్రం చాలా మేలు జరిగింది. ఇంతకుముందు ఈ పార్క్ కు పిల్లా పెద్దా ఎవరూ వచ్చేవారు కాదు. కానీ, ‘పోకెమాన్’ పుణ్యమా అని ఈ పార్క్ ఇప్పుడు కళకళలాడుతోంది. ఈ గేమ్ లోని పోకో స్టాప్స్ వల్ల ఈ ఆట ఆడేవాళ్లందరూ ఒకే చోటకు చేరుతున్నారు. దీంతో, ఈ పార్క్ కు వచ్చేవారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. విద్యార్థులు, ఉద్యోగులు అక్కడికి వెళుతున్నారు. ‘పోకెమాన్’ ఆడటం రాని వారి కోసం ఈ గేమ్ నేర్పిస్తామంటూ ట్రైనర్లు కూడా అక్కడ సిద్ధమయ్యారు. ‘పోకెమాన్’ పుణ్యమా అని ఈ పార్క్ కళకళలాడుతోందని అక్కడికి వచ్చిన కొందరు చెప్పారు. కాగా, మన దేశంలోకి ‘పోకేమాన్’ అధికారికంగా విడుదల కానప్పటికీ, అనధికారికంగా డౌన్ లోడ్ చేసుకుని ఆడేస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

  • Loading...

More Telugu News