: ఇలాంటి తీర్పొస్తుందని ముందే ఊహించా: ప్రొఫెసర్ కోదండరాం


భూ సేకరణ జీవో 123 ని హైకోర్టు కొట్టివేయడంపై టీజేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వుండే జీవోలను తీసుకువస్తే ఏదో ఒక రోజు ఇలాంటి తీర్పే వస్తుందని ఊహించానని అన్నారు. బలవంతపు భూసేకరణకు సాధనంగా 123 జీవోను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుందని విమర్శించారు. 2013 భూ సేకరణ చట్టం హక్కులను ప్రభుత్వం కాలరాసిందని, ప్రభుత్వం తన బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించాలని కోదండరాం సూచించారు. కాగా, 123 జీవో ప్రకారం ప్రభుత్వం నేరుగా భూములను సేకరిస్తుండటంతో తమకు అన్యాయం జరుగుతోందంటూ మెదక్ జిల్లా రైతులు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు ఆ జీవోను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News