: కారు బోల్తా... పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ నాయకుడికి గాయాలు


కారు బోల్తా కొట్టిన ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ కార్యవర్గ సభ్యుడు వైట్ల కిషోర్ కు స్వల్ప గాయాలయ్యాయి. నిన్న వైఎస్సార్సీపీ నిర్వహించిన బంద్ కార్యక్రమంలో పాల్గొన్న కిషోర్ ఆ తర్వాత తన అనుచరులతో కలిసి పెనుమంట్రకు కారులో వెళుతుండగా మార్టేరు-ఆచంట రహదారిలో ఆ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. పోలీసులు అరెస్టు చేసిన నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ కవురు శ్రీనివాసుకు మద్దతు తెలిపేందుకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. కిషోర్ గాయపడ్డ సమాచారం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News