: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి నుంచి ఒక్కనెలలో రూ.38లక్షల 70 వేలు వసూలు
హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ చేస్తున్న వారిని పోలీసులు ఏ మాత్రం ఉపేక్షించడం లేదు. తాగి వాహనాలు నడుపుతోన్న వారికి ఇకపై ఫైన్, చిన్నపాటి శిక్షలు కాకుండా జైలుకు పంపేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నారు. మోతాదుకు మించి మద్యం సేవించి పోలీసులకు పట్టుబడితే జైలుకు పంపే నిబంధనలను అధికారులు రూపొందించారు. హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి నుంచి గత నెల రూ.38లక్షల 70 వేలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గత నెలలో 1084 మందిపై నగర పోలీసులు కోర్టులలో చార్జ్‌షీట్ వేస్తే, వారిలో సగం మందికి పైగా జైలు శిక్షలు పడ్డాయి.