: ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్షసూచన.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకొని అల్పపీడనం ఉందని, వాయవ్య బంగాళాఖాతంలో అది కొనసాగుతోందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు. కోస్తా తీరం వెంబడి గంటకు 55-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక చేశారు.